శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (15:17 IST)

తెలుగు రాష్ట్రాల్లో దారుణం... శరీరాలను విక్రయించినా శిక్షల్లేవు!

నేరాలు, ఘోరాల్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మానవ అక్రమ రవాణా కేసుల్లో ఉభయ రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నాయని జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్.సి.ఆర్.

నేరాలు, ఘోరాల్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మానవ అక్రమ రవాణా కేసుల్లో ఉభయ రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నాయని జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్.సి.ఆర్.బి) వెల్లడించింది. ముఖ్యంగా, శరీరాలను విక్రయించినప్పటికీ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఏమాత్రం స్పందన లేదని పేర్కొంది. 
 
ప్రతి యేటా వేలాది మంది బాలికలు, మహిళలు అక్రమంగా రవాణా అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదువుతుండగా, కరువు ప్రాంతమైన కదిరి, రాయచోటి, కడప మొదలుకొని రాజధాని ప్రాంతమైన గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల నుంచి కూడా మహిళలు అక్రమ రవాణాకు గురవుతున్నారు. తెలంగాణలో నల్లగొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నుంచి కూడా బాధితులున్నారు. 
 
మానవ అక్రమ రవాణాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు దేశంలో 8, 9 స్థానాల్లో ఉండటం ఆందోళనకర పరిణామం. గత యేడాదిలో ఏపీలో 239 అపహరణ, మిస్సింగ్‌కు సంబంధించిన కేసులు నమోదు కాగా అందులో మొత్తం మహిళలే ఉన్నారు. వారిలో 87 శాతానికి పైగా వ్యభిచార గృహాలకు విక్రయించారు. మొత్తం 883 మందిని రక్షించిన పోలీసులు 599 మందిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వారిలో కేవలం ఇద్దరికి మాత్రమే కోర్టుల్లో శిక్షలు పడ్డాయని ఈ వేదిక బట్టబయలు చేసింది.