హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్లు.. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్
పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు దేవరాజన్ దాఖలు చేసిన పిటిషన్
పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు దేవరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌లో, రాష్ట్రంలో తృతీయ ప్రౌవృత్తిగా హిజ్రాలుగా గుర్తించిన పభుత్వం వారికి ఓటు హక్కు కల్పించి అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సముదాయాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ వారికి ప్రత్యేక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని పిటిషన్‌లో కోరారు.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్‌కే కౌల్, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన ధర్మాససం విచారణ జరిపింది. ఈ సమస్యపై పొరుగుదేశాల్లో అమలవుతున్న తీరును పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై అధ్యయనం చేసి నివేదికను దాఖలు చేయాలని దేవప్రశాంతను నియమించిన న్యాయమూర్తులు తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు.