గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:02 IST)

కొరఢా ఝుళిపించిన కేంద్రం.. విదేశీయుల వీసాలు రద్దు

కేంద్రం కొరఢా ఝుళిపించింది. జనతా కర్ఫ్యూతో పాటు.. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన సమ్మేళనానికి హాజరైన విదేశీయుల వీసాలను రద్దు చేసింది. ఈ మర్కజ్ మసీదులో తబ్లీగి జమాత్ సంస్థ ఈ మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. 
 
ఇందులో పలు కరోనా బాధిత దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వీరందరి వీసాలను రద్దు చేసింది. అలాగే, మరో 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను బ్లాక్‌ లిస్టులో ఉంచుతూ కేంద్రం ఆదేశారు జారీచేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ముఖ్యంగా, పర్యాటక వీసాలపై వచ్చి తబ్లీగి కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వ గుర్తించింది. తద్వారా విదేశీయుల చట్టం -1946, విపత్తు నిర్వహణ చట్టం - 2005ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, రాష్ట్రాల పోలీస్ డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలుజారీచేసింది.