మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By ఎంజీ
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (10:03 IST)

గుహలు ఎలా ఏర్పడతాయి?

కొండ గుహలలు అధిక శాతము భూగర్భజలాల కదలివల్ల ఏర్పడినవే. భూమిమీదపడిన నీరు లోపలికి ఇంకుతూ పోతుంది. ఆ ప్రయత్నములో ఏదో ఒక చోట రాయి తగిలితే ఆ రాతిని కరిగించి చిన్న రంధ్రము చేసి ఆ రంధ్రము గుండా ప్రయాణము చేస్తూ ఒక పెద్ద మార్గాన్ని ఏర్పరుస్తాయి.

గాలిలో ఉండే కార్బన్‌ డై ఆక్షైడ్ వలన నీరు ఆమ్లగుణము సంతరిందుకొని రాతిని తినివేస్తుంది. క్రమముగా రాయి కరిగిపోయి పగుళుగా తయారవుతుంది.

ఆ పగుళ్ళను నీరు మరింత విశాలము చేసుకుంటూ పోతాయి. ఫలితము గా ఒక గుహ ఏర్పడుతుంది.కొండల పైన పడిన వాననీరు ఈవిధముగా గుహలు ఏర్పడడానికి కారణమవుతుంది.
 
ప్రపంచము లో ఎన్నో గుహలు ఉన్నాయి . అతి పెద్ద గుహ 530 కి.మీ. పొడవు కలిగినది అమెరికాలో ఉన్నది . మన తెలుగు రాస్ట్రములో అజెంతా-ఎల్లోరా గుహలు ప్రసిద్ధి చెందినవి.