లింగ భైరవి ఆలయంలో పూజారిగా మారిన విదేశీ వనిత
ఓ విదేశీ వనిత భారత దేశంలో అడుగు పెట్టి.. ఓ ఆలయంలో పూజారిగా మారింది. తమిళనాడు కోవైలోని లింగ భైరవి ఆలయంలో ఓ విదేశీ వనిత పూజారిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆ మహిళ క్రిస్టియన్, విదేశీయురాలు. ఆమె పేరు హనీ.
ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని, తన కుటుంబాన్ని విడిచి హిందూ ఆలయానికి పూజారిణిగా విధులను నిర్వహిస్తుంది.
లెబనాన్‌కి చెందిన భైరాగిణి అని పిలువబడే హనీనే గ్రాఫిక్ డిజైనింగ్ చదివి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసేది. హనీ పేరును భైరాగిణిగా మార్చుకుంది.
2009 నుంచి ఫుల్ టైమ్ వాలంటీర్‌గా వచ్చి భారతదేశానికి వచ్చి 14 సంవత్సరాలు అయింది. సద్గురు మార్గదర్శకత్వంలో లింగ భైరవి దేవి ఆలయంలో పూజారిగా మారింది.