శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (11:28 IST)

యువతితో వివాహేతర సంబంధం వద్దన్నదనీ భార్యను భర్త ఏం చేశాడంటే...

వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టిస్తాయి. ఓ యువతితో అక్రమ సంబంధం వద్దని చెప్పినందుకు ఓ కసాయి భర్త తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ జిల్ల

వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టిస్తాయి. ఓ యువతితో అక్రమ సంబంధం వద్దని చెప్పినందుకు ఓ కసాయి భర్త తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ జిల్లా కైదీ గ్రామంలో జరుగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కైదీ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తికి వివాహమైంది. ఈయనకు భార్య ఉండగానే ఇదే గ్రామానికి చెందిన మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో నిలదీసింది. అక్రమసంబంధం వద్దని చెప్పింది. దీంతో ఆగ్రహించిన అరుణ్ కుమార్... భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. 
 
హత్యకు గురైన మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర తాము అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశామని రూరల్ ఎస్పీ అజయ్ సహదేవ్ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో పెళ్లి చేసుకునేందుకే అరుణ్ కుమార్ భార్యను హతమార్చాడని పోలీసులకు అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.