ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 1 మార్చి 2017 (14:39 IST)

బలవంతంగా సెక్స్ చేయబోయాడు... అందుకే ఆ పని చేశా... ఒప్పుకున్న భార్య

భార్యాభర్తల మధ్య మనస్పర్థల్లో చాలామటుకు దాంపత్య సుఖానికి చెందినవిగా వుంటాయని ఓ సర్వేలో తేలింది. ఇది చాలాసార్లు నిజమనేందుకు నిదర్శనాలు కూడా మనకు కనబడుతుంటాయి. బెంగళూరులో భర్త దాంపత్య సుఖం కోసం ఒత్తిడి

భార్యాభర్తల మధ్య మనస్పర్థల్లో చాలామటుకు దాంపత్య సుఖానికి చెందినవిగా వుంటాయని ఓ సర్వేలో తేలింది. ఇది చాలాసార్లు నిజమనేందుకు నిదర్శనాలు కూడా మనకు కనబడుతుంటాయి. బెంగళూరులో భర్త దాంపత్య సుఖం కోసం ఒత్తిడి చేయగా అతడిని అడ్డుకునేందుకు భార్య అతడి వ్యక్తిగత భాగంపై కాలితో తన్నిన ఘటనలో అతడు మరణించాడు. వివరాల్లోకి వెళితే... బెంగ‌ళూరు కవితా లేఅవుట్‌ మారుతి నగర్‌లో 45 ఏళ్ల ఉమేశ భార్య నిర్మలతో ఉంటున్నాడు. వీరికి 13 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. 
 
ఉమేశ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి నయంకాని జబ్బు వచ్చినట్లు వైద్యులు చెప్పినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నిర్మల భర్తతో లైంగికంగా దూరంగా వుంటూ వస్తోంది. ఐతే అతడు మాత్రం సెక్స్ కావాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఎంత చెప్పినా అతడు వినకపోగా బలవంతంగా సెక్స్ చేసేందుకు ప్రయత్నించాడు. 
 
ఈ క్రమంలో ఇద్దరిమధ్య పెనుగులాట జరిగింది. భర్త ఎంత వారించినా వినకపోవడంతో అతడి మర్మాంగంపై భార్య నిర్మల బలంగా తన్నింది. దానితో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై భర్త తరపువారు ఆమెపై కేసు పెట్టారు. పోలీసుల ముందు జరిగిన విషయాన్ని చెప్పింది నిర్మల. తను కావాలని తన్నలేదనీ, అతడిని అడ్డుకునేందుకే అలా చేశాననీ, అతడు చనిపోతాడని అనుకోలేదని వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.