శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 8 ఏప్రియల్ 2017 (21:21 IST)

అక్కడ రామాలయం ఉంది... ఉరి వేసుకునేందుకు నేను రెడీ... ఫైర్ బ్రాండ్ ఉమ

అయోధ్యలో రామాలయం విషయం మెల్లగా రగులుతుందా అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. అయోధ్య రామాలయంపై మళ్లీ చర్చ మొదలైంది. శనివారం నాడు కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామాలయం వుండేదని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను జైలుకు వ

అయోధ్యలో రామాలయం విషయం మెల్లగా రగులుతుందా అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. అయోధ్య రామాలయంపై మళ్లీ చర్చ మొదలైంది. శనివారం నాడు కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామాలయం వుండేదని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే. అంతేకాదు ఉరి వేసుకోమన్నా వేసుకుంటానంతే అని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో ఆమె శనివారం నాడు భేటీ అయ్యారు.
 
ఆ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... అయోధ్యలో రామాలయం గురించి తమ ఇద్దరికీ తెలుసునన్నారు. ఇందులో కొత్తగా చెప్పాల్సిందేమీ లేదన్నారు. ఐతే అయోధ్య వ్యవహారం కోర్టు పరిధిలో వున్నందున దీనిపై తను స్పందించకూడదన్నారు. న్యాయస్థానం వెలుపల అయోధ్యపై ఓ రాజీకి రావాలని సుప్రీంకోర్టు ఇటీవలే సూచించిన నేపథ్యంలో దీనిపై చర్చ జరుగుతోంది.