గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 31 మే 2021 (09:35 IST)

నాకు వ్యాక్సిన్ అవసరమే లేదు: రాందేవ్ బాబా

వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతిపై యోగా గురువు రాందేవ్ బాబా మళ్లీ విమర్శలు చేశారు. కొన్ని దశాబ్దాలుగా నేను యోగాభ్యాసం చేస్తున్న తనకు వ్యాక్సిన్ అవసరమే లేదన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నా, కొందరు మరణిస్తున్నారని, అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయలేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శలు చేశారు.

‘‘కొన్ని దశాబ్దాలుగా నేను యోగాభ్యాసం చేస్తున్నాను. అలాగే ఆయుర్వేద విధానాన్ని కూడా అనుసరిస్తున్నాను. నాకు వ్యాక్సిన్ అవసరమే లేదు. ఆయుర్వేదమనే పురాతన చికిత్సకు భారత్‌తో పాటు విదేశీయులు కూడా ఫాలో అవుతున్నారు. దాదాపు 100 కోట్ల మందికి పైగా ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నవారు ఉన్నారు.

రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం లభిస్తుంది. ఆయుర్వేద వైద్య విధానాన్ని అల్లోపతి విధానంతో పోల్చుతూ... కొందరు ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపిస్తున్నారు’’ అంటూ రాందేవ్ బాబా తీవ్రంగా మండిపడ్డారు.