ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (16:42 IST)

అందరూ కళ్లప్పగించి చూశారే కానీ.. ఎవ్వరూ సాయం చేయలేదు.. ఫేస్‌బుక్‌లో యువతి వేదన

దేశంలో మహిళలకు భద్రత కరువైంది. రోడ్డుపై ఓ మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆపదలో ఉన్న మహిళలను కాపాడేందుకు ప్రజలు ఏమాత్రం ముందుకు రావట్లేదు. మహిళలపై దాడులు, అరాచకాలు జరుగుతున్న ధ

దేశంలో మహిళలకు భద్రత కరువైంది. రోడ్డుపై ఓ మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆపదలో ఉన్న మహిళలను కాపాడేందుకు ప్రజలు ఏమాత్రం ముందుకు రావట్లేదు. మహిళలపై దాడులు, అరాచకాలు జరుగుతున్న ధైర్యం చేసుకుని అడిగే వారు కనుమరుగైయ్యారు. అలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన 26 ఏళ్ళ యువతి ఢిల్లీలోని గుర్‌గ్రామ్‌ సైబర్ సిటీ ఐటీ సంస్థలో కన్సల్టెంట్‌గా పని చేస్తోంది. ఇటీవల సెలవులకు సొంతూరు వెళ్ళిన ఆమె రాత్రి ఏడు గంటలకు తిరిగి గుర్‌గ్రామ్ చేరింది. 
 
వోల్వో బస్సు దిగిన ఆమె క్యాబ్ కోసం ప్రయత్నించింది. రాత్రి కావడంతో పాటు ఆలస్యమవడంతో బస్సులో ఇంటికెళ్దామని బస్టాప్ వద్దకు వెళ్ళింది.  అక్కడ కొంత మంది కూడా ఉన్నారు. ఇక ఆఫీసుల నుంచి ఇళ్ళకు తిరిగి వెళ్తున్న వారితో ఆ ప్రాంతం బాగా రద్దీగా ఉంది. ఇంతలో ఓ స్కార్పియోలో వచ్చిన కొందరు ఆ యువతిని లోనికి లాగేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె గట్టిగా కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. చివరకు తనను తానే కాపాడుకుంది. సాహసం చేసి కాలుతో కారు డోర్‌ను నొక్కిపెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. 
 
ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో దుండగులు ఆ యువతిని రోడ్డుపై తోసేసి వాహనంలో వెళ్ళిపోయారు. ఈ ఘటనపై చాలారోజుల పాటు బాధపడిన ఆమె చివరకు సామాజిక మీడియాతో పంచుకుంది. ఇంత జరుగుతున్నా ఆ రద్దీ ప్రాంతంలో అంతా కళ్ళప్పగించి చూశారేగాని ఏ ఒక్కరూ ఆ యువతిని కాపాడేందుకు ముందుకు రాలేదు. నిందితుల వాహన వివరాలు తెలియక పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయింది.