మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 22 మార్చి 2021 (22:33 IST)

రైళ్లలో సిగరెట్‌ తాగితే భారీ జరిమానా, ఎంత వేస్తే తాగకుండా వుంటారు?

దిల్లీ: రైళ్లలో సిగరెట్‌/ బీడీలు తాగే వ్యక్తులకు భారీ జరిమానా విధించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అరెస్టులు సైతం చేయాలని యోచిస్తోంది. ఇటీవల జరిగిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీ మంటల్లో చిక్కుకోవడానికి సిగరెట్‌ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నెల 13న న్యూదిల్లీ- దెహ్రాదూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌5 బోగీ మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్‌/ బీడీ వేయడం వల్ల అక్కడున్న టిష్యూ పేపర్లు నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు విచారణ జరిపిన అధికారులు నిర్ధారణకు వచ్చారు.
 
ఇటీవల రైల్వే బోర్డు సభ్యులతో రైల్వే మంత్రి సమావేశంలో పొగతాగే అంశం చర్చకు వచ్చింది. రైళ్లలో పొగ తాగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. 
ప్రస్తుతం రైళ్లలో పొగతాగితే రూ.100 వరకు జరిమానా విధిస్తున్నారు.