బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2025 (08:51 IST)

ఆ పులిని చంపేయండి... కేరళ సర్కారు ఆదేశం!!

Bengal tiger Abhimanyu
ఓ మహిళపై దాడి చేసి చంపి ఆరగించిన పులిని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేరళ రాష్ట్రలోని వయనాడ్‌లోని మనంతాడి సమీపంలో కాఫీ తోటలో పని చేస్తున్న 45 యేళ్ల రాధ అనే మహిళపై ఓ పులి ఇటీవల దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె శరీరంలోని కొంత భాగాన్ని ఆహారంగా తీసుకుంది. 
 
పిమ్మట అటవీశాఖ అధికారి జయసూర్యపై కూడా దాడి చేసి గాయపరిచింది. ఈ వరుస దాడులతో ఆ ప్రాంత వాసులు ప్రాణభయంతో వణికిపోతూ, కాఫీ తోటల్లో పని చేసేందుకు వెళ్లడం లేదు. పైగా, ఆ పులి ఎపుడు ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో వణికిపోతూ బిక్కుబిక్కుమటూ గడుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి శశీంద్రన్ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి, తక్షణం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశించార. కాగా, కేరళ రాష్ట్రంలో ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.