శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (15:56 IST)

బాలికపై అత్యాచారం కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని బల్లిని మింగేసిన నిందితుడు

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బల్లిని మింగేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు.
 
ఇటీవల పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. త్వరలో జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అతడు పోలీస్ స్టేషన్‌లో ఉండగానే బల్లిని మింగేశాడు. దీంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం నిందితుడి పరిస్థితిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 
 
ఈడెన్ గార్డెన్స్‌ మ్యాచ్‌లకు టికెట్ ధరలు ఇవే...
 
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా బెంగాల్ క్రికెట్ సంఘం ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్న టిక్కెట్ల రేట్లను వెల్లడించింది. ఈ టోర్నీ అక్టోబరు 5వ తేదీ నుంచి నవంబరు 19వ తేదీ వరకు జరుగనుంది.
 
ఇందులోభాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మధ్య పోరు, సెమీ ఫైనల్‌తో పాటు మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ క్రమంలో టిక్కెట్ల ధలను బెంగాల్ క్రికెట్ సంఘం ప్రకటించింది. టిక్కెట్ల ధరలు రూ.650, రూ.3000 వరకు నిర్ణయించింది. భారత్ సౌతాఫ్రికా మ్యాచ్, సెమీస్‌కు ఒకే రకమైన ధరలను నిర్ణయించగా మిగతా మూడు మ్యాచ్‌లకు వేర్వేరు ధరలతో టిక్కెట్లను విక్రయించింది. ప్రస్తుతం దాదాపు 63500 సీట్ల కెపాసిటీ ఈడెన్ గార్డెన్స్ సొంతం. 
 
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌తో పాటు సెమీస్‌ మ్యాచ్‌కు అప్పర్ టైర్ రూ.900, డీ, హెచ్ బ్లాక్‌లు రూ.1500, సీ, కే బ్లాక్‌లు రూ.2500, బీ, ఎల్ బ్లాకులు రూ.3 వేలు. నెదర్లాండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్‌ టిక్కెట్ ప్రారంభ ధర రూ.650 (అప్పర్ టైర్స్), ఇతర బ్లాకులకు రూ.1500, రూ.2500, రూ.3 వేలు చొప్పున నిర్ణయించారు. అలాగే, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌ జట్లతో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు రూ.800 (అప్పర్ టైర్), ఇతర బ్లాకులకు రూ.1200, రూ.2 వేలు, రూ.2200 చొప్పున ఖరారు చేసింది.