గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 3 అక్టోబరు 2020 (15:26 IST)

అణు క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగిన శౌర్య క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి గురి తప్పకుండా లక్ష్యాన్ని చేదించింది. శౌర్య క్షిపణి పరిధి 800 కిలోమీటర్లు. ఇది భూ తలం నుంచి భూ తలం పైకి ప్రయోగించే వీలున్న క్షిపణి.
 
ఇటీవల కాలంలో శౌర్యను మరింత అభివృద్ధి చేశారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరచిన అప్డేటెడ్ వెర్షన్‌నే ఇవాళ పరీక్షించి చూసారు. ప్రస్తుతం పాత వెర్షన్ శౌర్య భద్రతా బలగాల వద్ద ఉంది. అయితే కొత్తది ఎంతో తేలికైనది. ఇది ప్రయోగించడానికి ఎంతో సుళువైనదని రక్షణరంగ వర్గాలు తెలిపాయి.
 
శౌర్య క్షిపణి ప్రత్యేకత ఏమిటంటే లక్ష్యానికి దగ్గరయ్యే సమయంలో హైపర్ సోనిక్ వేగాన్ని అందుకుంటుంది. తద్వారా దీన్ని నిలువరించడం ఏ వ్యవస్థకు సాధ్యం కాదు. అణ్వస్త్రం సామర్థ్యం ఉన్న శౌర్య క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది.