నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-50 నౌక.. 1410 కిలోలతో సీఎంఎస్-01ను కూడా మోసుకెళ్లింది..
పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్-01 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను నింగిలోకి ఇస్రో పంపింది. సీ-బ్యాండ్ సేవల విస్తరణకు సీఎంఎస్-01 దోహదపడనుంది.
శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి... PSLV సీ-50 రాకెట్‌ను ప్రయోగించారు. 25 గంటల కౌంట్‌డౌన్ తర్వాత మధ్యాహన్నం 3గంటల 41 నిమిషాలకు అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేసింది ఇస్రో. దీనికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ కూడా ముందే పూర్తయ్యాయి. ఈ శాటిలైట్ బరువు 1410 కిలోలు.
అండమాన్, నికోబర్, లక్షద్వీప్‌లలో... ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించనుంది. దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇది ఏడేళ్ల పాటు కక్షలో తిరుగుతూ ఉంటుంది. PSLV సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వ ప్రయోగం కాగా... షార్ నుంచి చేపడుతున్న 77వ మిషన్ ఇది.
నింగిలోకి నిప్పులు విరజిమ్ముతూ పీఎస్‌ఎల్‌వీ-సి50 వాహకనౌక దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 1,410 కిలోల బరువు గల కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-01ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఇస్రో చరిత్రలోనే సిఎంఎస్-01 42వ సమాచార ఉపగ్రహం. 1410 కిలోల ఈ సిఎంఎస్ - 01 శాటిలైట్ జీవిత కాలం ఏడేళ్లు. ఈ ప్రయోగం విజయమంతమైతే దేశంతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కి సమాచార వ్యవస్థ పూర్తిస్థాయిలో మెరుగు పడనుంది. 20.11 నిమిషాల్లోనే కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.