చంద్రయాన్-4కు సిద్ధమవుతున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల జరిపిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో ఇపుడు చంద్రయాన్-4కు సిద్ధమవుతుంది. చంద్రుడిపై నుంచి శాంపిల్స్ తీసుకునిరావడం పై ఇస్రో పని చేస్తుంది. వచ్చే ఐదు లేదా ఏడు సంవత్సరాల్లో మిషన్ చేపడుతామని ఇస్రో శాస్త్రవేత్త నీలేశ్ దేశాయ్ వెల్లడించారు.
కాగా, చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ తర్వాత ఇస్రో మరో భారీ మిషన్లకు సిద్ధమవుతుంది. లాపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు సిద్ధమవుతుంది. ఈ మిషన్ల ద్వారా 350 కేజీల ల్యాండర్‌ను 90 డిగ్రీల ప్రాంతం (చీకటి వైపు)లో ల్యాండ్ చేయడానికి, శాంపిల్స్‌ను సేకరించి తిరిగి తీసుకొచ్చే మిషన్ ప్రయోగాల కోసం ప్రస్తుతం పని చేస్తున్నట్టు అహ్మదాబాద్‌లో ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు.
చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుడిపై దిగిన తర్వాత సెంట్రల్ మాడ్యుల్ అక్కడ నుంచి శాంపిల్స్‌ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వచ్చే ఐదు లేదా ఏడేళ్ళలో చేపడుతామని ఆయన పేర్కొన్నారు.