సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (12:27 IST)

గగన్ యాన్ మిషన్ టీవీ డీ-1 టెస్ట్ ప్రయోగం సక్సెస్

isro launchpad
గగన్ యాన్ మిషన్ టీవీ డీ-1 టెస్ట్ ప్రయోగం సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 
 
కెట్ 17 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ‘అబార్ట్’ సంకేతం పంపారు. దీంతో రాకెట్ లోని క్రూ ఎస్కేప్ వ్యవస్థ యాక్టివేట్ అయింది.
 
రాకెట్ నుంచి విడివడి పారాచూట్ సాయంతో సముద్రంలో ల్యాండ్ అయింది. ప్రయోగం ఆద్యంతం అనుకున్నట్లుగానే కొనసాగిందని ఇస్రో ప్రకటించింది.