మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (11:38 IST)

మధురై మల్లెపువ్వులా మజాకా కిలో ధర రూ.3వేలు

jasmine
మధురై అంటేనే మల్లెపువ్వులే గుర్తుకు వస్తాయి. ఆ మల్లెలకు వున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. మధురై మల్లెపువ్వులకు చాలా డిమాండ్ వుంది. అయితే తాజాగా మధురై మల్లెపువ్వులు వార్తల్లో నిలిచాయి. మదురై మార్కెట్‌లో మల్లె పువ్వుల ధర ఆకాశాన్ని తాకింది. మంగళవారం కిలో మల్లె పువ్వులు రూ. 3 వేలు ధర పలికాయి.
 
అలాగే, ఇతర పువ్వుల ధర సైతం అమాంతం పెరిగింది. వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గడంతో పువ్వుల ధరలకు రెక్కలొచ్చాయి.  
 
నిన్న మొన్నటి వరకు ఈ మల్లె కిలో రూ. 1500 పలికింది. వినాయక చవితి తర్వాత ధర భారీగా పెరిగింది. మంగళవారం ఉదయాన్నే కిలో మల్లె రూ.3000 పలికింది. మదురై రకం మల్లె పువ్వుల ధర అమాంతంగా పెరగడంతో కొనుగోలు దారులకు షాక్‌ తప్పలేదు. అలాగే, కనకాంబరం కిలో రూ. వెయ్యికి పైగా పలికింది. రోజా, సంపంగి, చామంతి వంటి పువ్వుల ధరలు కూడా పెరిగాయి.