శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (14:06 IST)

పుణ్యక్షేత్రంలా మారిన జయలలిత సమాధి.. తలనీలాలు సమర్పిస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలు

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి, కోట్లాది మందికి అమ్మగా మారిన జయలలిత చివరి మజిలి మెరీనా తీరానికి చేరింది. ఆమె అంత్యక్రియలు మెరీనా తీరంలో ముగిశాయి. ఇపుడు జయలలిత సమాధి ఓ పుణ్యక్షేత్రాన్ని తల

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి, కోట్లాది మందికి అమ్మగా మారిన జయలలిత చివరి మజిలి మెరీనా తీరానికి చేరింది. ఆమె అంత్యక్రియలు మెరీనా తీరంలో ముగిశాయి. ఇపుడు జయలలిత సమాధి ఓ పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. 
 
జయలలిత అంత్యక్రియల్లో లక్షలాది మంది పాల్గొన్నారు. ఇపుడు మరో అరుదైన ఘట్ట ఆవిష్కృతమైంది. అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన మెరీనా బీచ్ వేలాదిమందితో మరోసారి పోటిత్తెంది. దీంతో ఎంజీఆర్, జయలలితను సమాధుల ప్రదేశం పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు, పురుషులు అమ్మకు నివాళిగా తలనీలాలు సమర్పిస్తూ ప్రియమైన అమ్మపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
 
జయలలిత ఆఖరి విశ్రాంత స్థలం వద్ద అన్నా డీఎంకే కార్యాకర్తలు, ఇతర అభిమానులు గౌరవం సూచకంగా తలనీలాలు సమర్పిస్తూ నివాళులర్పిస్తున్నారు. అసంఖ్యాకంగా హాజరైన ఆమె అభిమానులు సమాధిని దర్శించుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో అన్నాశాలై జనసంద్రమైంది. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు.