మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (08:57 IST)

కైలాస దేశంలో ఉద్యోగాలు... వేతనంతో కూడిన యేడాది పాటు శిక్షణ

nithyananda
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి సొంతంగా ఏర్పాటు చేసుకున్న కైలాస దేశంలో ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యేడాది పాటు వేతనంతో ఎంపిక చేసిన ఉద్యోగాలపై శిక్షణ ఇస్తామని అందులో పేర్కొన్నారు. 
 
ఈ ఉద్యోగాల్లో విశ్వవిద్యాలయం, కైలాస ఆలయాలు, ఐటీ విభాగం, రాయబార కార్యాలయం, విద్యుత్ శాఖ, గ్రంథాలయ తదితర శాఖల్లో ఖాళీలంటూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి కైలాస దేశంలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. 
 
కాగా, నిత్యానంద ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. శ్రీలంకలో చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన భక్తులు అక్కడి ప్రభుత్వాన్ని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.