గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (11:39 IST)

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. డ్రోన్ల కొనుగోలుపై సబ్సిడీ

Farmers
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రంగం సిద్ధం చేస్తోంది. డ్రోన్‌లను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ క్రమంలో రైతులను ప్రోత్సహించేందుకు దాని కొనుగోలుపై సబ్సిడీ ఇచ్చే పథకాన్ని సిద్ధం చేశారు. 
 
ఈ పథకం కింద డ్రోన్‌కు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీ.. గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు రైతులకు కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది.
 
ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతులకు డ్రోన్‌ల ధరలో 50 శాతం చొప్పున గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇతర రైతులకు డ్రోన్‌ల కొనుగోలుకు 40 శాతం లేదా గరిష్టంగా రూ. 4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు.
 
డ్రోన్ల సాయంతో రైతులు ఎరువులు, ఇతర పురుగులు మందులను సులభంగా వేయవచ్చు. దీంతో రైతులకు చాలా సమయం ఆదా అవుతుంది. దీనితో పాటు పురుగుమందులు, మందులు, ఎరువులు కూడా ఆదా అవుతుంది.