గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (11:34 IST)

ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా.. అయితే మళ్లీ అప్‌డేట్ చేసుకోవాల్సిందే..

aadhaar update
కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఆధార్ కార్డు ఇపుడు ప్రతి ఒక్కరికీ ప్రధాన ఆధారంగా మారింది. అలాంటి ఆధార్ కార్డును తీసుకుని పదేళ్లు దాటిన వారు తమ వివరాలను మళ్లీ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ మేరకు ఆధార్ (ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్) రెగ్యులేషన్ 2016లో కొత్తగా 16ఏ నిబంధనను చేర్చింది. ఈ నిబంధన ప్రకారం ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఇకపై పదేళ్లకోసారి గుర్తింపు కార్డును, చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించే కేంద్ గుర్తింపు సమాచార నిధి (సీఐడీఆర్)లో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, చేసుకోవాలన్న నిర్బంధం కూడా లేదు. 
 
ఈ ప్రక్రియ కారణంగా పౌరుల సమాచారం ఎప్పటికపుడు అప్‌డేట్ అవుతుందని యూఐడీఏఐ తెలిపింది. మై ఆధార్ పోర్టల్ లేదంటే సమీపంలోని ఆధార్ కేంద్రం నుంచి ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
ఇదిలావుంటే, దేశంలో ఇప్పటివరకు మొత్తం 134 కోట్ల మందికి ఆధార్ కార్డులను జారీచేసింది. వీరిలో గత యేడాది మాత్రమే 16 కోట్ల మంది తమ కార్డులను అప్‌డేట్ చేసుకున్నారు.