ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (12:58 IST)

కర్నాటకలో కావేరీ సెగలు.. స్తంభించిన జనజీవనం

karnataka bandh
కావేరీ జలాలను తమిళనాడు రాష్ట్రానికి విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్నాటక రాష్ట్రంలో శుక్రవారం బందా పాటిస్తున్నారు. ఈ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. బెంగుళూరు, మైసూర్, మాండ్యా తదితర ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఈ బంద్ కారణంగా వ్యాపార సంస్థలు, హోటల్లు, విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. బంద్‌కు దాదాపు 2 వేలకు పైగా సంస్థలు మద్దతు ప్రకటించాయి. బెంగూళూరు విమానాశ్రయం నుంచి దాదాపు 44 వరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. 
 
కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కుట సంస్థ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఎన్నో సంఘాలతో కూడిన ఉమ్మడి వేదికే కన్నడ ఒక్కుట. అయితే, ఈ బంద్ ప్రభావం అత్యధికంగా బెంగుళూరులోని కనపిస్తుంది. ప్రజల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. 
 
కన్నడ ఒక్కుట సంస్థ కార్యకర్తలు విమానాశ్రయంలోకి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమాన సర్వీసులను ఆయా సంస్థలు రద్దు చేయాయి. అలాగే, ప్రైవేటు, ప్రభుత్వ రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.