పెళ్లి మండపాల్లో మార్షల్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు!!

marriage
ఠాగూర్|
కర్నాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులోభాగంగా, కర్నాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమై, కీలక నిర్ణయం తీసుకుంది.

ఇలాంటి నిర్ణయాల్లో ఇకపై పెళ్లి మండపాల్లో కాపలా కోసం మార్షల్స్‌ను పెట్టనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడా కూడా జనాభా 500 దాటకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలిపింది.

ఇదే అంశంపై ఆ రాష్ట్ వైద్య ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ.. కరోనా మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. '500కు మించి జనాభా ఎక్కడా చేరడానికి వీల్లేదు. అంతేకాదు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేస్ మాస్క్ వినియోగించాలి' అని సుధాకర్ పేర్కొన్నారు.

దీనిపై మరింత చదవండి :