శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (15:15 IST)

ముగ్గురిని ప్రేమించిన భవిత.. చివరకు శవమైంది.. ఎలా?

కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ యువతి ముగ్గురు యువకులను ప్రేమించి, చివరకు శవమైకనిపించింది. తల్లిదండ్రులను కాదని, ఒంటరిగా జీవిస్తూ వచ్చిన ఆ యువతి ఈ నెల 19వ తేదీన కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఫోటోను కూడా అప్‌లోడ్ చేసింది. అలాగే, చేతిపై ఓ యువకుడి పేరుతో టాటూ ఉంది. చివరకు శవమైకనిపించింది. ఆమెను ప్రియుడు హత్య చేశాడా? లేక ఆత్మహత్య చేసుకుందా అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కర్నాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా హసన్ పట్టణంలోని బీఎమ్ రోడ్డులో ఉన్న సరయు హోటల్‌ వెనుక 23 సంవత్సరాల వయసున్న యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, చనిపోయిన యువతిని అరకలగుడుకు చెందిన భవిత‌గా(23) గుర్తించారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ యువతి 18 సంవత్సరాల వయసులో ప్రేమ పేరుతో తల్లిదండ్రులతో గొడవ పడి ఇల్లు వదిలి వెళ్లిపోయిందనీ, తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఆమెను తిరిగి తీసుకొచ్చినప్పటికీ వారితో ఉండేందుకు ఆమె అంగీకరించలేదని తేలింది. దీంతో అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులకు దూరంగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపింది. భవిత పెద్దగా చదువుకోలేదని, అయితే.. ఆమె ముగ్గురు యువకులను ప్రేమించిందని దర్యాప్తులో వెల్లడైంది. 
 
ఈ పరిస్థితుల్లో గత పది రోజులుగా హోటల్‌లో బస చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. ఈ నెల 19వ తేదీన కూడా ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఫొటో అప్‌లోడ్ చేయడం గమనార్హం. అలాగే, ఆమె చేతిపై పునీత్ అని టాటూ ఉండటంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. శనివారం రాత్రి పునీత్ ఆమె రూమ్‌కు వెళ్లినట్లుగా పోలీసులు తేల్చారు. అయితే.. భవితను పునీత్ హత్య చేశాడా లేక ఆమెనే ఆత్మహత్యకు పాల్పడిందా అన్న విషయం తెలియాల్సి ఉంది.