మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 డిశెంబరు 2016 (20:51 IST)

కరుణానిధి డిశ్చార్జ్... బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఆసుపత్రిలో అడ్మిట్

డీఎంకే చీఫ్ కరుణానిధిని కావేరీ ఆసుపత్రి శుక్రవారం నాడు డిశ్చార్జ్ చేసింది. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో డీఎంకె అభిమానులు కోలాహలంతో ఆయనను ఊరేగింపుగా ఇంటికి తోడ్కొని వచ్చారు. ఇదిలావుంటే బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి రూపా గంగూలి ఈరోజు సాయంత్రం తీవ్ర

డీఎంకే చీఫ్ కరుణానిధిని కావేరీ ఆసుపత్రి శుక్రవారం నాడు డిశ్చార్జ్ చేసింది. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో డీఎంకె అభిమానులు కోలాహలంతో ఆయనను ఊరేగింపుగా ఇంటికి తోడ్కొని వచ్చారు. ఇదిలావుంటే బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి రూపా గంగూలి ఈరోజు సాయంత్రం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన తలనొప్పి, కళ్లు సరిగా కనబడకపోవడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె మెదడులో రక్తం గడ్డకట్టినట్లు నిర్థారించారు.
 
రూపా ఆరోగ్యంపై పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు జాయ్ ప్రకాష్ మజుందార్ మాట్లాడుతూ... రూపాను తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చామనీ, విషయం తెలిసన తర్వాత ఆమెను కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఏఎంఆర్ఐ ఆసుపత్రిలో చేర్చినట్లు చెప్పారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నదనీ, ఐతే ఆమెను ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలియదని చెప్పారు. గత ఏడాది నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రూపా గంగూలీని నియమించారు.