గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:28 IST)

కుంభమేళా ఎఫెక్ట్.. 102 మందికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్నది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తరాఖండ్‌లోనూ రోజూ క్రమం తప్పకుండా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. కుంభమేళాకు హాజరైన మొత్తం 18,169 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా అందులో 102 మందికి పాజిటివ్ వచ్చింది.
 
కుంభమేళాకు వస్తున్న భక్తులు మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి కొవిడ్ నిబంధనలను సరిగా పాటించకపోవడంవల్లనే కరోనా వైరస్ చాలామందిలో బయటపడిందని వైద్యసిబ్బంది చెబుతున్నారు. 
 
భక్తులు కొవిడ్ నిబంధనలను పాటించకపోవడానికి అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే మాస్కులు పెట్టుకోని వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉత్తరాఖండ్ పోలీసులు చెబుతున్నారు.