క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం.. బ్లడ్ ఇన్‌పెక్షన్‌తో..

lalu prasad yadav
ఎం| Last Updated: ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (12:31 IST)
రాంచీ: రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ సైతం నిలకడగా లేవని వైద్యులు చెబుతున్నారు. బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ పలు ఆరోగ్య సమస్యలతో రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

పశుగ్రాసం కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 నుంచి ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. రిమ్స్‌లో లాలూ చేరినప్పటి నుంచి ఆయనకు డాక్టర్ డీకే ఝా వైద్యచికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బ్లడ్ ఇన్‌పెక్షన్ లాలూ శరీరంలో వ్యాపించిందని, ఆయన కిడ్నీ 63 శాతం దెబ్బతినగా, 37 శాతం మాత్రమే సరిగా పనిచేస్తోందని డాక్టర్ ఝా తెలిపారు.

యాంటీబయోటిక్ మెడిసన్లు కారణంగా కూడా ఆయన కిడ్నీ పనితీరు మందగించిందన్నారు. లాలూ తీసుకునే డైట్ కూడా గతంలో కంటే తగ్గిందని, ప్రస్తుతం మందులు ఇస్తున్నామని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యబృందంలో ఒకరైన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తెలిపారు.దీనిపై మరింత చదవండి :