గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (10:33 IST)

అవును.. ఆమెతో శశిథరూర్ మూడు రాత్రులు గడిపారు.. ఎవరు?

కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు సునంద పుష్కర్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో శశిథరూర్‌కు వ్యతిరేకంగా కీలక సాక్ష్యం పోలీసులకు లభించింది. సునంద పుష్కర్ కేసులో ప్రధాన నిందితుడైన శశిథరూర్.. పాకిస్థాన్ జర్నలిస్టుతో గడిపిన మాట నిజమేనని నళినీ సింగ్ కీలక సాక్ష్యమిచ్చింది. దీంతో శశిథరూర్‌కు గట్టి షాక్ తప్పలేదు. 
 
పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు మెహర్ తార్డ్‌తో శశి థరూర్ మూడు రాత్రులు గడిపాడని, సునంద స్నేహితురాలు నళినీ సింగ్ కోర్టులో వెల్లడించారు. ఆమె వాంగ్మూలాన్ని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ శ్రీవాస్తవ, న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ ముందు చదివి వినిపించారు. 
 
సునంద తనకు మూడు సంవత్సరాలుగా తెలుసునని, చనిపోవడానికి ఏడాది ముందు నుంచే తన వ్యక్తిగత విషయాలను పంచుకునేదని నళినీ సింగ్ చెప్పుకొచ్చారు. శశిథరూర్ విషయంలో సునంద చాలాసార్లు ఏడ్చిందని చెప్పుకొచ్చింది. దుబాయ్‌‌లో మెహర్‌ తో తన భర్త గడిపి వచ్చారని ఆమె పేర్కొన్నట్టు తెలిపారు. వారి మధ్య శృంగార సందేశాలు కూడా నడిచాయని చెప్పి తనతో ఆవేదన వ్యక్తం చేస్తూ.. భావోద్వేగానికి గురైందని వెల్లడించారు.