సునంద శరీరంలో విషం... తేల్చిన పోస్టు మార్టం నివేదిక

Last Updated: బుధవారం, 21 ఆగస్టు 2019 (12:07 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసులో తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె శరీరంలో విషం ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్‌తో శశిథరూర్‌కు ఉన్న సంబంధం కూడా సునందను మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఆమె అనుమానాస్పదంగా చనిపోయారు.

ఈ కేసులో శశిథరూర్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 498-ఏ, 306 కింద కేసులు నమోదై ఉన్నాయి.ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సునంద శరీరంలో విషం ఉందని, శరీరంపై 15 చోట్ల గాయాలు ఉన్నాయని చెప్పారు.
దీనిపై మరింత చదవండి :