గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

స్వల్పంగా మెరుగుపడిన లతా మంగేష్కర్ ఆరోగ్యం

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడింది. రెండు రోజుల క్రితం ఆమె వెంటిలేటర్‌ సపోర్టును తొలగించారు. ఆమె ఐసీయూ వార్డులోనే ఉంచి వైద్యుల పరిశీలనలో కొనసాగుతుందని బ్రీచ్ కాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతీత్ సందానీ వెల్లడించారు. ఈ మేరకు ఆ ఆస్పత్రి వైద్యులు ఆదివారం ఒక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. 
 
గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అస్వస్థతకు లోనైన విషయం తెల్సిందే. దీంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం విషమంగా మారినప్పటికీ ఆ తర్వాత నుంచి ఆమె కోలుకున్నారు.
 
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడటంతో ఆమెకు అమర్చిన వెంటలేటర్‌ను తొలగించినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, డాక్టర్ ప్రతీత్ సందానీ నేతృత్వంలోని వైద్య బృందం ఆమె ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ వస్తుంది.