ఆర్ముగం కమిషన్.. జయలలిత మాట్లాడిన ఆడియో లీక్
తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జయ మరణం, అందుకు దారితీసిన పరిస్థితులపై అసలు విషయాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు అప్పటి తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ఏర్పాటు చేసింది.
ఆ కమిషన్ రూపొందించిన నివేదిక ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి చేరింది. దీంట్లో అత్యంత ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆ తర్వాతి నుంచి జయ మృతికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఆసుపత్రిలో జయలలిత మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది.
ఈ ఆడియోను ఎవరు? ఎందుకు? రికార్డు చేశారన్న వివరాలు బయటకు రాలేదు. అయితే, అర్ముగస్వామి కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత ఈ ఆడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.