గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (20:23 IST)

దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌పై రూ. 5 కోట్ల ప‌రువు న‌ష్టం దావా..

మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత న‌వాబ్ మాలిక్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదిరిన నేప‌థ్యంలో త‌న ఇంట్లో డ్ర‌గ్స్ ల‌భించాయ‌ని చేసిన వ్యాఖ్య‌ల‌పై ఫ‌డ్న‌వీస్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మాలిక్ డిమాండ్ చేశారు. 
 
ఫ‌డ్న‌వీస్ క్ష‌మాప‌ణ చెప్ప‌కుంటే ఆయ‌న‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని న‌వాబ్ మాలిక్ హెచ్చ‌రించారు. ఫ‌డ్న‌వీస్ ఇటీవ‌ల జ‌రిగిన విలేకరుల స‌మావేశంలో మాలిక్‌కు అండ‌ర్‌వ‌ర‌ల్డ్ మాఫియాతో సంబంధాలున్నాయ‌ని, ఆయన ఇంట్లోనే డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయంటే ప‌రిస్ధితి ఎలా ఉందో ఊహించుకోవ‌చ్చ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు.
 
ఫ‌డ్న‌వీస్ వ్యాఖ్య‌ల‌పై మాలిక్ అల్లుడు స‌మీర్ ఖాన్ ఆయ‌న‌కు లీగ‌ల్ నోటీసులు పంపారు. ఫ‌డ్న‌వీస్‌పై రూ. 5 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేశారు. మ‌రోవైపు ఫ‌డ్న‌వీస్‌కు డ్ర‌గ్స్ వ్యాపారుల‌తో సంబంధాలున్నాయ‌ని మాలిక్ ఇటీవ‌ల‌ ఆరోపించారు. 
 
ఫ‌డ్న‌వీస్‌తో డ్ర‌గ్స్ వ్యాపారి జైదీప్ రాణా క‌లిసిఉన్న ఫోటోను విడుద‌ల చేశారు. దీనికి ప్ర‌తిగా మాలిక్‌కు దావూద్ అనుచ‌రుడు రియాజ్ భాటితో సంబంధాలున్నాయ‌ని ఫ‌డ్న‌వీస్ ఆరోపించారు.