మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 1 ఏప్రియల్ 2021 (17:16 IST)

బోయ్‌ఫ్రెండ్‌కి మద్యం బాటిల్ ఆర్డర్: యువతి నుంచి రూ. 2 లక్షలు కొట్టేశారు, ఎలా?

తనతో పాటు పనిచేసే ఉద్యోగి. అతని పుట్టినరోజు. అందరూ గిఫ్ట్ బ్యాక్స్‌లు ఇవ్వడం... శుభాకాంక్షలు చెప్పడం మామూలే అనుకుంది ఆ యువతి. తనకు ఇష్టమైన వ్యక్తి.. స్నేహితుడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. అధిక ధర కలిగిన మద్యం బాటిల్‌ను ఇవ్వాలనుకుంది. వైన్ షాపుకు వెళ్ళలేక ఇబ్బంది పడి ఆన్లైన్లో వెతుకుతూ మోసగాళ్ళ చేతిలో అడ్డంగా దొరికిపోయింది.
 
బెంగుళూరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది రంజిత అనే ఉద్యోగిని. సహ ఉద్యోగి పుట్టినరోజు నిన్న. అతని పుట్టినరోజుకు అధిక ధర ఉన్న మద్యం బాటిల్‌ను గిప్ట్‌గా ఇవ్వాలనుకుంది. అయితే మద్యం షాపుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడింది. అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నప్పుడు మద్యం కూడా దొరుకుతుందని భావించింది.
 
అనుకున్నదే తడువుగా మద్యం బాటిల్ కోసం సైట్లను వెతుకుతున్న ఆమెకి ఒక నెంబర్ కనిపించింది. పదివేల రూపాయలు ఫోన్ పేలో పంపిస్తాను. ఇంటికి మద్యం పంపిస్తారా అంది. దీంతో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోయారు.
 
యువతిని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నారు. ఇలా చేయడంతో ఆమె అకౌంట్ నుంచి 30 వేలు వేరే అకౌంట్‌లోకి వెళ్ళిపోయాయి. ఆ తరువాత ఎక్కువ డబ్బులు వచ్చాయని నమ్మించి మళ్ళీ స్కాన్ చేయమన్నారు. ఇలా 2 లక్షల దాకా లాగేశారు. దీంతో యువతి మోసపోయామని తెలుసుకుని సైబర్ పోలీసులకు ఆశ్రయించింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.