ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (19:15 IST)

పని ఒత్తిడి.. హెచ్‌డీఎఫ్‌సీ మహిళా ఉద్యోగిని కుప్పకూలిపోయింది..

woman
పని ఒత్తిడి కారణంగా ఓ మహిళా ఉద్యోగానికి ప్రాణాలు కోల్పోయిన ఘటన లక్నోలో చోటుచేసుకుంది. నానాటికి పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా ఆఫీసులోనే ఆ మహిళా ఉద్యోగిని కుప్పకూలి మృతి చెందింది. ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగిని హెచ్‌డీఎఫ్‌సీలో పనిచేస్తుందని తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్నో నగరంలోని గోమతినగర్‌ విబూతిఖండ్‌ బ్రాంచ్‌లో అడిషనల్‌ డిప్యూటి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సదఫ్‌ ఫాతిమా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అయితే మంగళవారం ఉద్యోగంలో వుండగానే.. ఉన్నట్టుండి కుర్చీలోనే కిందపడిపోయింది. 
 
తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పని ఒత్తిడి వల్లే ఆమె మృతి చెందినట్లు సహచర ఉద్యోగులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.