బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (12:56 IST)

లూడో నిషేధించాలని హైకోర్టులో పిటిషన్.. అది లక్కీ గేమ్..

LUDO
లూడో గేమ్‌కు సంబంధించి బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లూడో అదృష్టానికి సంబంధించిన ఆట అని, నైపుణ్యానికి సంబంధించినది కాదు అంటూ పిటీషనర్ పేర్కొన్నారు. పిల్ల‌లు మొద‌లుకొని పెద్ద‌ల వ‌ర‌కు ఆడుతున్న లూడో గేమ్‌ను ల‌క్కీ గేమ్‌గా ప్ర‌క‌టించాల‌ంటూ దాఖలైన పిటిష‌న్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారో తెలపాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది.
 
మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన అధికారి కేశవ్ ములే ఈ పిటిషన్ దాఖలు చేశారు. లూడో సుప్రీం యాప్‌లో ప్రజలు డబ్బు పెట్టి ఆడుతున్నారని, పెద్ద మొత్తంలో నలుగురు వ్యక్తులు డబ్బులు పెట్టి ఈ ఆట ఆడుతున్నారని, 20 రూపాయ‌ల గేమ్‌లో విజేతకు రూ.17, యాప్ నడుపుతున్న వ్యక్తికి రూ.3 లభిస్తుంద‌ంటూ పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
 
బెట్టింగ్ నిషేధ చట్టంలోని 3, 4, 5 సెక్షన్ల క్రిందకు ఈ గేమ్ వస్తుందని, స‌ద‌రు గేమ్ నిర్వాహ‌కులపై చర్యలు తీసుకోవాల‌ంటూ కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. పిటీషన్‌పై రాష్ట్రప్రభుత్వం స్పందన కోరిన హైకోర్టు.. తదుపరి విచారణ జూన్ 22వ తేదీకి వాయిదా వేసింది.