మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (15:21 IST)

వేరొక వ్యక్తితో కాపురం.. భార్య భుజాలపై అలా చేసి.. కర్రలతో కొడుతూ..

భర్తతో విడిపోయి వేరొక వ్యక్తితో కలిసి జీవిస్తున్న కారణంగా మహిళపై ఆమె భర్త అనాగరికంగా వ్యవహరించాడు. గిరిజనురాలైన ఆమె భుజాలపై భర్త కుటుంబసభ్యుడిని కూర్చోబెట్టి 3 కిలోమీటర్ల వరకు బలవంతంగా నడిపించాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భర్త కుటుంబానికి చెందిన కొందరు యువకులు మహిళ వెనక ఉండి.. ఆమె వేగం తగ్గినప్పుడల్లా పాశవికంగా కర్రలతో కొట్టారు. ఈ దారుణం సాగై-బాన్స్‌ఖేడీ గ్రామాల మధ్య జరిగినట్లు తెలిసింది. మహిళ ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
భర్త అంగీకారంతోనే తాను విడిపోయినట్లు, ఇప్పుడు వేరే యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.