మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (14:28 IST)

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం.. సునామీ తలపించేలా మృతులు

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఏకంగా సునామీని తలపించేలా చేస్తోంది. గత ఏప్రిల్ 1నుంచి 30 వరకూ 17లక్షలకుపైగా ప్రజలు కరోనా బారినపడ్డారు. ఈక్రమంలో ప్రతీ రోజు 50 వేలమందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. దీంతో దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఏ రేంజ్‌లో పెరుగుతుందో ఊహించుకుంటేనే ప్రాణాలు హడలిపోతున్నాయి. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 17.46 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
 
ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మొత్తం 17,46,309 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఏప్రిల్‌ 1న 28,56,163గా ఉన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య నెలాఖరు నాటికి 46,02,472 చేరింది. కాగా, గతేడాది సెప్టెంబర్‌ 16న మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 10,97,856గా ఉంది.  
 
రాష్ట్రంలో కరోనా రెండోసారి విజృంభించడంతో కేవలం 30 రోజుల్లోనే 17.46 లక్షల కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా గత 167 రోజుల్లో కరోనాతో 14,039 మంది మృతిచెందారు. కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం టెస్టుల సంఖ్యను కూడా రెట్టింపు చేసింది. ఏప్రిల్‌ నెలలో మొత్తం 1,99,75,341 నమూనాలను పరీక్షించింది.