1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (10:11 IST)

భారత్‌లో కరోనా విలయతాండవం.. 4లక్షలతో రికార్డ్.. ఒక్కరోజే 3,464 మంది మృతి

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో నిత్యం రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 
 
తాజాగా .. గడిచిన 24 గంటల్లో 19,45,299 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 4,08,323 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,91,63,488కి చేరింది.
 
నిన్న ఒక్క రోజే 3,464 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,11,778కి చేరింది. నిన్న 2,97,488 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,56,71,536 కి చేరింది. 
 
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 చొప్పున నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో కరోనాతో 828 మంది మరణించగా, ఢిల్లీలో 375 మంది, ఉత్తరప్రదేశ్‌లో 332 మంది మృతిచెందారు.