మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ తేదీల ప్రకటన.. కౌంటింగ్ ఎప్పుడంటే?
మహారాష్ట్రలో నవంబర్ 20న, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం తెలిపారు.మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది.
మహారాష్ట్రలోని 36 జిల్లాల పరిధిలోని 288 అసెంబ్లీ స్థానాలకు, జార్ఖండ్‌లోని 25 జిల్లాల్లో 81 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటర్ల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తామని, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి నివాసంలో ఓటు వేసేందుకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.