శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (14:04 IST)

బీజేపీని కుక్కలా మార్చే సమయం ఆసన్నమైంది : మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

nana patole
ఓబీసీ వర్గానికి చెందిన ప్రజలకు ఏమాత్రం గౌరవం లేదని, ఆ వర్గానికి చెందిన ప్రజలను భారతీయ జనతా పార్టీ నేతలు కుక్కలతో పోల్చుతున్నారని, అయితే, ఇపుడు అదే బీజేపీని కుక్కలా పోల్చే సమయం ఆసన్నమైందని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చఫ్ నానా పటోలే ఓటర్లకు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా, అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బీజీపీ నేతలు కుట్ర పన్ని కూలగొట్టారని, బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తనను తాను దేవుడుగా భ్రమపడుతున్నారని విమర్శించారు. ఓబీసీ కమ్యూనిటీపై బీజేపీ ఏమాత్రం గౌరవం లేదన్న ఆయన మిమ్మల్ని కుక్కలు అంటున్న బీజేపీకి అకోలా జిల్లాలోని ఓబీసీలు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీని ఇపుడు కుక్కలా మార్చే సమయం వచ్చిందన్నారు. 
 
మహారాష్ట్ర నుంచి బీజేపీని పారదోలే సమయం ఆసన్నమైందన్న నానా పటోలే పలు అబద్దాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఇపుడు దాని స్థానమేంటో చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు. బీజేపీ నేతలు తమను తాము దేవుడిగా, విశ్వగురువుగా అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఫడ్నవిస్ కూడా తనను తాను దేవుడుని అనుకుంటూ భ్రమపడిపోతున్నారంటూ విమర్శించారు.