మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (20:01 IST)

మహారాష్ట్ర ఎన్నికలు: వ్యానులో వామ్మో రూ.3.70 కోట్లు స్వాధీనం

cash notes
మహారాష్ట్రలో నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ వ్యాన్ నుంచి రూ.3.70 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం పోలీసులు చెప్పారు. అలాగే శుక్రవారం కోస్తా జిల్లాలోని వాడాలో కూడా నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ దత్తా కింద్రే తెలిపారు.
 
జిల్లా గుండా ఒక వ్యాన్ నగదును రవాణా చేస్తున్నట్లు పోలీసుల విజిలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు పక్కా సమాచారం అందింది. సమాచారం మేరకు ఆ బృందం వ్యాన్‌ను అడ్డగించి తనిఖీ చేయగా రూ.3,70,50,000 నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. నగదు రవాణాకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పత్రాలను అందించడంలో డ్రైవర్-సెక్యూరిటీ సిబ్బంది విఫలమయ్యారని తెలిపారు. 
 
నవీ ముంబైకి చెందిన ఓ కంపెనీ నుంచి పాల్ఘర్‌లోని విక్రమ్‌గడ్‌కు నగదును తరలిస్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. నగదును స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ కోసం ఆదాయపు పన్ను శాఖతో పాటు ఎన్నికల అధికారులకు సమాచారం అందించామని, వ్యాన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.