ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 జులై 2017 (18:53 IST)

నడిరోడ్డుపై 11 మంది ఓ వ్యక్తిని కత్తులతో నరికేశారు..

దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నడిరోడ్డుపై ఇటీవల వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అడ్డంగా నరికేసిన ఘటన మరవక ముందే.. మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చుస్తుండగా దాదాపు 11 మంది

దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నడిరోడ్డుపై ఇటీవల వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అడ్డంగా నరికేసిన ఘటన మరవక ముందే.. మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చుస్తుండగా దాదాపు 11 మంది ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో రఫీఖుద్దీన్ అనే వ్య‌క్తి రోడ్డుపక్కనే వున్న దుకాణంలో టీ తాగుతుండగా.. 11 మంది అతనిని కత్తులతో దాడి చేసి చంపేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు బాధితుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి శరీరంపై 27 కత్తిపోట్లు పడ్డాయి. నిందుతులంతా బైకులపై పారిపోయారు. మృతుడైన  రఫీఖుద్దీన్ పై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.