శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 మే 2023 (17:43 IST)

మహాత్మా గాంధీ మనవడు ఇకలేరు.. అనారోగ్యంతో మృతి

arun manilal gandhi
జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ మణిలాల్ గాంధీ ఇకలేరు. కొల్హాపూర్‌లోని అవనీ సంస్థాన్‌లో బస చేస్తూ వచ్చిన ఆయన ఫ్లూ లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆయన్ను ప్రయాణం చేయొద్దని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన అవనీ సంస్థాన్‌లోనే ఉండిపోయి, అక్కడే తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. 
 
సాధారణ ఫ్లూ లక్షణాలు ఉండటంతో ఏస్టర్ ఆధార్ హాస్పిటల్‌లో చేర్పించినట్టు భోస్లే వెల్లడించారు. ఈ వ్యాధి నుంచి ఆయన కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన తిరిగి అవనీ సంస్థాన్‌కు చేరుకున్నారు. అయితే, ఆయన్ను ప్రయాణం చేయొద్దని వైద్యులు సలహా ఇవ్వడంతో కొల్హాపూర్‌లోనే ఉండిపోయారు. సోమవారం కూడా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాత్రి వరకు రాసుకుంటూ ఆ తర్వాత నిద్రించిన మణిలాల్.. ఉదయం చూసేసరికి మరణించివున్నారని వెల్లడించారు.