శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (14:10 IST)

రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు.. సూరత్ కోర్టు సంచలన తీర్పు

rahul gandhi
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలుశిక్ష విధిస్తూ గురువారం సంచలన తీర్పునిచ్చింది. గత 2019లో కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు 'మోడీ' అనే ఎందుకు ఉంటాయంటూ ప్రశ్నించారు. 
 
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే గుజరాజ్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తాజాగా రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ వెంటనే ఆయనకు 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది. 
 
కాగా, ఈ కోర్టు తీర్పు తర్వాత రాహుల్ గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. "నా మతం.. సత్యం, అహింసపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు. అహింసే అందుకు సాధనం. మహాత్మా గాంధీ' అని ట్వీట్ చేశారు.