శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (13:32 IST)

కోల్‌కతా వేదికగా మమతా మెగా షో.. తరలివచ్చిన నేతలు.. లక్షల్లో జనం

కోల్‌కతాలోని బిగ్రేడ్ మైదానంలో వేదికగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు దేశం నలుమూలల నుంచి వివిధ పార్టీల నేతల తరలివచ్చారు. అలాగే, ఈ సభకు లక్షల్లో జనం తరలివచ్చారు. ముఖ్యంగా, ఈ మెగా షోకు దేశం నలుమూలల నుంచి 25 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ సభకు బీజేపీయేతర విపక్ష పార్టీలకు చెందిన నేతలు తరలిరావడం గమనార్హం. 
 
ఈ సభకు వచ్చిన వారిలో మాజీ ప్రధాని దేవగౌడ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం కుమార స్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎల్జేడీ చీఫ్ శరద్ పవార్, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లతోపాటు బీజేపీ మాజీ నేతలు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హాలు కూడా ఈ మెగా షోకు రావడం గమనార్హం. అలాగే, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా వచ్చారు.