ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 15 మే 2019 (13:38 IST)

సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ సర్కార్‌కు ఎదురుదెబ్బ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పైన అభ్యంతరకరమైన పోస్టును పెట్టిన బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మను తక్షణం విడుదల చేయాలని, చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మమత సర్కారుకు సుప్రీంకోర్టు హెచ్చరిక జారీచేసింది. మమతా బెనర్జీపై వివాదాస్పద ఫోటోను నెట్లో పోస్ట్ చేసిన ప్రియాంక శర్మ అరెస్టు ఏకపక్ష నిర్ణయంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 
 
ప్రియాంక శర్మను విడుదల చేయాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలను మమతా బెనర్జీ సర్కార్ బేఖాతరు చేయడంతో శర్మ బంధువులు మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ప్రియాంక శర్మను తక్షణం విడుదల చేయాలని లేకపోతే తదుపరి పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. 
 
అయితే మమత పైన అభ్యంతరకరమైన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు ప్రియాంక శర్మ భేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఆమెను విడుదల చేస్తామని ప్రకటించారు పశ్చిమబెంగాల్ అధికారులు. మమత సుప్రీంకోర్టు మాట వింటుందో లేదా మొండికేస్తుందో వేచిచూడాలి.