శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (16:15 IST)

భార్యలను మార్చుకున్న నలుగురు.. షేర్‌చాట్ స్నేహమే అలా చేయించిందా?

తాళికట్టిన భార్యను కడవరకు కాపాడాల్సిన భర్త.. భార్యను అమ్ముకోవాలనుకున్నాడు. ఇంకా స్నేహితులకు కూడా ఆమెను పంచాలనుకున్నాడు. అంతేగాకుండా వారి భార్యలను కూడా తనతో గడపాలని డిమాండ్ చేశాడు.


ఇలా భార్యలను మార్చుకున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళ, కొల్లం జిల్లాకు చెందిన 25 నుంచి 32 ఏళ్ల లోపు గల వ్యక్తి తన భార్యను స్నేహితుడితో గడపాలని ఒత్తిడి చేసినట్లు అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఇంకా అతడిని అరెస్ట్ చేశారు. 
 
32 ఏళ్ల ట్రావెల్ ఏజెన్సీ ఉద్యోగి అయిన 32 ఏళ్ల వ్యక్తి ఆతని భార్యను అతని స్నేహితులతో పడక పంచుకోవాలని ఒత్తిడి చేసేవాడని కయంకులం పోలీసులు తెలిపారు. ఇలా అతని ముగ్గురు స్నేహితులు కూడా తమ భార్యలపై ఒత్తిడి చేశారని చెప్పారు.  
 
కోహికోడ్‌కు చెందిన వ్యక్తి షేర్‌చాట్ అనే సోషల్ మీడియా యాప్‌కు అలవాటు పడి.. అందులో స్నేహితులుగా పరిచయమైన వ్యక్తులతో భార్యను గడపాలని ఒత్తిడి చేశాడు. అలాగే ముగ్గురు స్నేహితుల భార్యలను కూడా మార్చుకోవాలని డిమాండ్ పెట్టాడు.

అయితే అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇండియన్ ప్యానెల్ 34, 354, 366 సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు.