సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (15:56 IST)

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు' : రాంగోపాల్ వర్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆరోపించారు. తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వచ్చే నెల ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు ఆయన విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
కానీ, హోటల్ యాజమాన్యం ఆయన బుక్ చేసుకున్న హాల్‌ను రద్దు చేసింది. దీంతో విజయవాడలోని పైపుల రోడ్డపైనే ఆదివారం రాత్రి 4 గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. అయితే, ఆయన్ను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు సమావేశాలకు, సభలు నిర్వహించేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. పైగా, రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఆర్జీవీకి పోలీసులు గుర్తుచేసి ఆయన్ను ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ, 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు' అని పేర్కొన్నారు.