శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (13:21 IST)

పోర్న్ చిత్రాలకు బానిసై.. భార్యను కడతేర్చాడు.. ఎక్కడ?

crime news
పోర్న్ చిత్రాలకు బానిసై.. భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమె హతమార్చిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన జాహీర్ పాషా, ముబీనాకు 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. 
 
జాహీర్ ఆటోనడుతుపు తనకుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, జాహీర్ కు పోర్న్ వీడియోలు చూసే పాడు అలవాటు ఉంది. దానికి ఇతను బానిసలా మారిపోయాడు. ఈ క్రమంలో అతను ఈ మధ్య చూసిన ఒక వీడియోలో మహిళ తన భార్యలాగా ఉండటాన్ని గమనించాడు.
 
అప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ముబీనాను వేధించేవాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
 
ఇక విసిగిపోయిన మహిళ తండ్రి గౌస్ పాషా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించగా ముబీనా వద్దని వారించింది. ఈ క్రమంలో గత ఆదివారం జాహీర్ పాషా ఇంటికి చేరుకున్నాడు. ఈ కక్ష్యతో భార్యను హతమార్చాలనుకున్నాడు. 
 
ఆదివారం రాత్రి జాహీర్ పాషా తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. మహిళ అరుపులకు పిల్లలు నిద్ర నుంచి మేల్కొన్నారు. వెంటనే భయంతో కేకలు వేశారు. ఆ తర్వాత.. అక్కడ నుంచి పారిపోయాడు. జరిగిన దారుణాన్ని.. జాహీర్ పాషా పిల్లలు విషయాన్ని ముబీనా తండ్రి గౌస్ పాషాకు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు.